
ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 18

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రణరంగం'

నీ సహనానికి హ్యాట్సాఫ్ రవి

సాహో మూవీ లో దుష్టచూపుల దేవరాజ్
'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్?
ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ పర్చా శరత్‌కుమార్ మృతి

RX 100 మూవీ బాలీవుడ్ రీమేక్ ప్రారంభం
హీరోలు చేస్తే కరెక్ట్ - మేము చేస్తే తప్పా?

బ్లాక్ బస్టర్ నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్

‘మన్మథుడు 2’... రన్ టైమ్ డిటైల్స్
శరవేగంగా ‘ఎంత మంచి వాడవురా’ చిత్రీకరణ
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు

ఢిల్లీలో ‘డిస్కో రాజా’ సందడి

థ్యాంక్స్ .. .. సాహో మూవీ టీమ్

నందమూరి అభిమానులకు శుభవార్త ?

సాహో రిలీజ్ తరువాత ప్రభాస్ మ్యారేజ్ ?

తమిళ సంవత్సరాదికి ఇండియన్ 2..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అడ్డంకులన్నింటినీ తొలగించుకున్న దర్శక నిర్మాతలు మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి అవసరమైన సన్నాహాలు మొదలుపెట్టారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న 'రణరంగం'
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రణరంగం. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న విడుదలకానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా వుంది చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది.
సాహో నుండి మరో విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్
టీమ్ సాహూ రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమాలో నటించిన విలన్ ఫస్ట్ లుక్స్ ను రోజుకొకటి రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. మొన్న మెయిన్ విలన్ నీల్ నితిన్ ముఖేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా నిన్న చుంకీ పాండే, అరుణ్ విజయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు మరో విలన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మలయాళం సినిమాల్లో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన లాల్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇబ్రహిం గా ఈ సినిమాలో కనిపించనున్నాడు.

నీ సహనానికి హ్యాట్సాఫ్ రవి
బాబోయ్ తమన్నా..! ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ రియాక్షన్ ఇదే. బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన తమన్నా.. నిజంగా ఆడియన్స్ సహనానికి ఓ పరీక్ష పెడుతుందని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ కే కాదు.. హౌస్ లో వున్నా మిగతా కంటెస్టెంట్స్ కి కూడా ఇది అగ్ని పరీక్షే. ఎందుకంటే తన నోటికి హద్దు లేకుండా మాట్లాడమే దీనికి కారణం.

సాహో మూవీ లో దుష్టచూపుల దేవరాజ్
సుజీత్ దర్శకత్వం లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ సందర్భంగా సాహో మూవీ కి సంబంధించిన విశేషాలతో ప్రేక్షకులను చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ చేస్తుంది. రీసెంట్ గా ప్రభాస్, శ్రద్ధా కపూర్ లపై చిత్రీకరించిన రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. త్వరలోనే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్?
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరేంద్ర అనే డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. మహేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేయనున్న రాహుల్?
హీరోగా సినీపరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పుడు డైరెక్టర్ గా బిజీ అయ్యాడు రాహుల్ రవీంద్రన్. చి.ల.సౌ తో తొలి సినిమాకు దర్శకత్వం వహించి మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసాడు. మళ్ళీ అదే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున ప్రధానపాత్రలో మన్మథుడు 2 సినిమా చేసేసాడు. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. అన్నీ కుదిరితే నాగచైతన్య తో కూడా సినిమా తీసే అవకాశం వుంది. అయితే ప్రస్తుతం చైతన్య ఖాళీ లేడు. వెంకీ మామ తరువాత శేఖర్ కమ్ముల సినిమా చేయాల్సివుంది. అలాగే అన్నీ కుదిరితే మేర్లపాక గాంధీ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే దిల్ రాజుకు ఓ సినిమా చేయాల్సివుంది.
ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ పర్చా శరత్‌కుమార్ మృతి
నాలుగు దశాబ్దాలుగా ఫిలిం జర్నలిస్ట్‌గా పలు సంస్థల్లో పనిచేసి సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ జర్నలిస్ట్ పర్చా శరత్‌కుమార్(74)గారు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 11.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హెచ్ఎంటి నగర్‌లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. పర్చా శరత్‌కుమార్ మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. హెచ్ఎంటిలో ఉద్యోగం చేస్తూ హాబీగా సినిమా వార్తలు, సమీక్షలు, సినిమా వారితో ఇంటర్వ్యూలు చేసేవారు. పాతతరం సినీ పెద్దలందరితో చనువుగా మెలిగేవారు. వివిధ…

RX 100 మూవీ బాలీవుడ్ రీమేక్ ప్రారంభం
దక్షిణాది మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అయి ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అర్జునరెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా రూపొందిన RX 100 మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు RX 100 మూవీ హిందీ లో రూపొందుతుంది.
హీరోలు చేస్తే కరెక్ట్ - మేము చేస్తే తప్పా?
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మన్మథుడు 2’. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటుంది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాలుగు పాటలు, సీన్లు ఉన్న పాత్ర కంటే.. నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలో నటించడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాలో తాను స్మోకింగ్ చేయడంపై కూడా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బ్లాక్ బస్టర్ నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్
శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని, నివేత థామస్ జంటగా, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించిన నిన్నుకోరి మూవీ 2017 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది. నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్ రైట్స్ ను కాస్మో కిరణ్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది .

‘మన్మథుడు 2’... రన్ టైమ్ డిటైల్స్
కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో... ‘వెన్నెల’ కిషోర్, లక్ష్మి, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రలలో దర్శనమివ్వనున్నారు. ‘మన్మథుడు’కి మరో వెర్షన్‌గా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ బాణీలు అందించాడు.

2019 బాలీవుడ్ టాప్ 10లో నంబర్ వన్ మూవీగా ‘కబీర్ సింగ్’
షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’. తెలుగునాట సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ వెర్షన్‌గా రూపొందిన ‘కబీర్ సింగ్’... బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్ళ కుంభవృష్టి కురిపించింది. అంతేకాదు... మొదటి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్... 2019కి గానూ (తొలి 7 నెలల్లో) బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇక ‘కబీర్ సింగ్’ తరువాత స్థానాలలో ‘ఉరి’, ‘భారత్’, ‘కేసరి’, ‘టోటల్ ఢమాల్’, ‘సూపర్ 30’, ‘గల్లీబాయ్’, ‘దే దే ప్యార్ దే’, ‘మణికర్ణిక’, ‘లుకా చుప్పి’ నిలిచాయి…
శరవేగంగా ‘ఎంత మంచి వాడవురా’ చిత్రీకరణ
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచి వాడవురా’. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు అందిస్తున్నాడు.
మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అలాంటి ఈ ఇద్దరి తొలి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. “శ్రీమంతులు బాగా వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం” అనే సామాజిక అంశంతో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ మూవీగా నిలచింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో... జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్, ఏడిద శ్రీరామ్, తులసి, సితార, ముఖేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

ఢిల్లీలో ‘డిస్కో రాజా’ సందడి
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ నాయికలుగా నటిస్తుండగా... సునీల్, రామ్కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

థ్యాంక్స్ .. .. సాహో మూవీ టీమ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ ప్రపంచవ్యాప్తం గా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న సాహో మూవీ గురించి కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ రీషెడ్యూల్ అయ్యాయి. ఈ సందర్భంగా సాహో మూవీ టీమ్ ఆయా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది.

నందమూరి అభిమానులకు శుభవార్త ?
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో తారాపథం లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం మార్చి నెలలో RRR మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ మూవీ తరువాత తాను నటించే మూవీస్ కు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.

సాహో రిలీజ్ తరువాత ప్రభాస్ మ్యారేజ్ ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ గురించి, అతని మ్యారేజ్ గురించి ప్రభాస్ అభిమానులు చాలా కాలం గాఎదురు చూస్తున్నారు.

కథానాయకుడిగా 15 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మంచు మనోజ్
కలెక్షన్ కింగ్ డా.ఎం.మోహన్‌బాబు నట వారసుడిగా తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు మంచు మనోజ్ కుమార్. బాలనటుడిగా `మేజర్ చంద్రకాంత్`, `అడవిలో అన్న` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్... అనంతరం కథానాయకుడిగానూ ప్రేక్షకులను అలరించాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్... ఇలా జానర్ ఏదైనా తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఈ మంచు వారబ్బాయి... ఇప్పటి వరకు 17 సినిమాల్లో హీరోగా నటించాడు. వీటిలో `నేను మీకు తెలుసా?`, `ప్రయాణం`, `బిందాస్`, `వేదం`, `ఝుమ్మంది నాదం` వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.