రేపు అంటే ఆగస్టు 9వ తేదీ ఉదయం 9 గంటలకు తన తాజా “వివాదాల కాజా” కు ముహూర్తం పెట్టాడు వివాదాల వినోద ప్రియుడు రాంగోపాల్ వర్మ. ఈ మధ్య కొద్ది రోజుల పాటు తన శిష్యుడు పూరి జగన్నాథ్ కు వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” హిట్ సెలబ్రేషన్స్ లో
షామ్పెయిన్ తో స్నానం చేసి సేదతీరి కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగాడు రాంగోపాల్ వర్మ. తనదైన వివాదాల మసాలాను జాతికి అంకితం చేయటంలో ఇంత గ్యాప్ రావటం దేశ ప్రయోజనాల దృష్ట్యా మంచిది కాదు అనుకున్నాడో ఏమో…?!
ఆగస్టు 9 శ్రావణ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతి జనులకు “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే తన తాజా సినిమాలోని ఒక కమ్మని పాటను దృశ్య, శ్రవణ రూపంలో అందిస్తానని, అంకితం చేస్తానని హామీ ఇచ్చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ హామీ తో పాటు నమ్మశక్యం కాని, నమ్మ వీలులేని, నమ్మలేని, నమ్మకూడని, ఎవ్వరూ నమ్మబోని ఒక విషయాన్ని చాలా నమ్మబలుకుతున్న ట్లుగా చెప్పాడు రాం గోపాల్ వర్మ. అదేమిటంటే… తన స్వీయ దర్శకత్వ, నిర్మాణ సారథ్యంలో వస్తున్న సదరు
“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అస్సలు వివాదాస్పద చిత్రమే కాదంట…!!??
ఏ మాత్రం మాంసాహార పదార్థాలే ఉండవంట్ట..!!??
ప్యూర్ వెజిటేరియన్ అంట…
నెల్లూరు రెడ్డి మిలిటరీ హోటల్, పంజాబీ ధాబా…
రోడ్డుసైడ్ కల్లు కాంపౌండు…
వంటి అట్మాస్పియర్ కు బదులు, శరవణ భవన్, శాంతా భవన్, చట్నీస్ వంటి ప్యూర్ వెజిటేరియన్ సినిమాను
చూపిస్తాడట… మనం నమ్మాలట… కావాలంటే చంద్రబాబు నాయుడు మీద ఒట్టట…
నమ్మేద్దామా ….
ఓవర్ యాక్షన్ లేని అరవ సినిమా ఉంటుందంటే….
ఓవర్ బడ్జెట్ కాని తెలుగు సినిమా ఉంటుందంటే…
వివాదం లేని వర్మ సినిమా ఉంటుందంటే…
నమ్మేద్దామా…
మన చెవిలో పువ్వులా కనిపిస్తున్నాయి… వీటన్నింటిని చూస్తూ… భరిస్తూ పెరిగినోళ్ళమేకదా మనం.
[youtube_video videoid=QNBHjGy4LyM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: