రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమిళ్ అర్జున్ రెడ్డి..!

2019 Latest Telugu Film News, Aditya Varma Gets a Release Date, Aditya Varma Release Date Fixed, Aditya Varma Release date Conformed, Aditya Varma Release date Released, Aditya Varma Release date Announced, Aditya Varma Release date Out, Aditya Varma Release date, Aditya Varma Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Aditya Varma Movie Release Date Fixed

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల హిందీలో రీమేక్ అయి.. అక్కడ కూడా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. హిందీలో షాహిద్ కపూర్, కియారా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగాకూడా ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదట స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వం వహించారు. అయితే అనుకున్న అవుట్ పుట్ ఇవ్వని నేపథ్యంలో సినిమాను మళ్లీ రీషూట్ చేశారు. తెలుగు అర్జున్ రెడ్డి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశాయ దర్శకత్వం లో రీ షూట్ స్టార్ట్ చేశారు.టైటిల్ కూడా వర్మ ను తీసేసి ఆదిత్య వర్మ గా మార్చారు. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ నటి బానిత సంధు ను ఎంపిక చేశారు. హీరోయిన్ ప్రియా ఆనంద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ రెడ్డికి సంగీతం అందించిన రధాన్ ఈ సినిమా కు కూడా సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 27 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. మరి తెలుగు, హిందీ లో సంచలనాలు సృష్టించిన ఈ సినిమా తమిళ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=EVrgWqwbdIE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + nine =