ప్రస్తుతం రాబోయే సినిమాల్లో పెద్ద సినిమా అవడం, బాహుబలి సినిమా తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా, భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ.. ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సాహో సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ సినిమా రిలీజ్ కి మూడు వారాల టైం ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీ గా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి వరుసగా విల్లన్ లుక్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఊపిరాడకుండా చేస్తున్నారు. ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేసారు. ఆగస్ట్ 10వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా పై నాని కూడా తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. సాహో’ మన సినిమా.. దేశవ్యాప్తంగా ‘సాహో’ విజయం సాధిస్తే అది తమకందరికీ వేడుక అని తెలిపాడు. అంతే కాదు.. ఆగస్టు 30న ‘సాహో’ రిలీజవుతున్న సందర్భంగా ప్రభాస్ అన్నకు, చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు అంటూ నాని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. దానితో పాటు ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ డేట్ ను రేపు ప్రకటిస్తామని వెల్లడించాడు.
#Saaho is our film which is making noise nation wide and when it succeeds its our celebration.
wishing Prabhas Anna and team nothing less than a huge blockbuster on August 30th 🤗#GANGLEADER release date will be announced tomorrow 🔥 pic.twitter.com/D6oJXOmFDA— Nani (@NameisNani) August 8, 2019
కాగా గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. అలాగే ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
[youtube_video videoid=8KwZW-wH0PI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: