భోళా శంకర్ పాటపై నిర్మాత కాన్ఫిడెన్స్

Producer Anil Sunkara Confidence on Bhola Shankar Song, Bhola Shankar Song Massive Sets, Bhola Shankar Song Set,Producer Anil Sunkara,Bholaa Shankar, Bholaa Shankar latest movie Updates, Bholaa Shankar Movie, Bholaa Shankar Movie Song Shooting Updates, Bholaa Shankar Movie Shoot updates, Bholaa Shankar Movie Shooting Updates, Bholaa Shankar Movie Updates, Bholaa Shankar Telugu Movie, Chiranjeevi, Chiranjeevi Bholaa Shankar Movie Updates, latest telugu movies news, Mega Star Chiranjeevi, Mega Star Chiranjeevi Bholaa Shankar movie Updates, Telugu Film News 2023, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates

బ్యాక్ టు బ్యాక్ సినిమాల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్. వరుస హిట్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తీస్తోన్న సంగతి తెలిసిందే. అజిత్ వేసిన పాత్రను ఇక్కడ చిరంజీవి చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను ముగించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈసినిమా హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాపై మరో అప్ డేట్ ఇచ్చారు నిర్మాత అనిల్ సుంకర. ఈ సినిమాలోని ఒక పాటను లిరిసిస్ట్ కాసర్ల్ శ్యామ్ రాస్తుండగా.. ఆయన తన ట్విట్టర్ లో ఈపాటపై స్పందిస్తూ తన చిరకాల కోరకి తీరబోతుందని తెలియచేశారు. ఇక దీనికి నిర్మాత అనిల్ సుంకర రిప్లై ఇస్తూ.. ఈపాట ఈసినిమాకు బెస్ట్ గా నిలుస్తుందని చెప్పాడు.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + one =