తమిళ్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లాంగ్వెేజ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమా చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. తమిళ్ లో ఈసినిమా వాతి అనే టైటిల్ తో వస్తుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇక నిన్ననే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న ధనుష్ మాష్టారు మాష్టారు పాటను పాడి ఆకట్టుకున్నాడు. సంయుక్తా మీనన్ ఈ పాట పాడమని ధనుష్‌ని కోరగా అందుకు ధనుష్ తమిళ వెర్షన్‌తో ప్రారంభించి తెలుగు వెర్షన్ లో ముగించారు. ధనుష్ తెలుగు వెర్షన్‌ను పాడటం తో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
How adorable is this 🤩🤩
Everyone’s Favourite & Multi-talented @dhanushkraja sings at #Sir / #Vaathi trailer launch event!! ❤️❤️#Dhanush #SIRTrailer #TeluguFilmNagar pic.twitter.com/Y3UpF4yaO3— Telugu FilmNagar (@telugufilmnagar) February 8, 2023
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా.. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా సాయికుమార్,తనికెళ్ల భరణి , నర్రాశ్రీను కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేయనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: