‘పవర్ ప్లే’ మూవీ రివ్యూ

Power Play Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Power Play,Power Play Movie,Power Play Movie Public Response,Power Play Movie Public Talk,Power Play Movie Public Talk And Public Response,Power Play Movie Review And Rating,Power Play Movie Updates,Power Play Public Response,Power Play Public Talk,Power Play Public Talk And Public Response,Power Play Review,Power Play Review And Rating,Power Play Telugu Movie,Power Play Telugu Movie Latest News,Power Play Telugu Movie Public Response,Power Play Telugu Movie Public Talk,Power Play Telugu Movie Public Talk And Public Response,Raj Tarun Power Play Telugu Movie Review,Power Play Telugu Movie Review And Rating,Raj Tarun Power Play Telugu Movie Review,Raj Tarun Power Play Movie Review,Power Play Telugu Movie Review

విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ తరణ్ చేస్తున్న రెండో సినిమా పవర్ ప్లే. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు రాజ్ తరుణ్. ఇప్పటి వరకూ లవ్ అండ్ యాక్షన్ సినిమా చేసిన రాజ్ తరుణ్ ఈసారి డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని అర్ధమైంది. తను చేయని నేరంలో రాజ్ తరణ్ ఇరుకున్నట్టు దాని నుండి బయటపడేందుకు తను చేసే ప్రయత్నాలే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. హేమల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో నటి పూర్ణ ఒక కీలకపాత్రలో నటిస్తుంది. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈసినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : పవర్ ప్లే (తెలుగు )
మూవీ డీటెయిల్స్ :
మూవీ – పవర్ ప్లే
కాస్ట్ – రాజ్ తరుణ్,హేమల్, పూర్ణ, ప్రిన్స్, కోట శ్రీనివాస రావ్, అజయ్, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్, కేడర్ శంకర్, అప్పాజీ, సత్యం రాజేష్, రవి వర్మ, ధన్ రాజ్, వేణు, భూపల్, మధునందన్, డి .డి శ్రీనివాస్, గగన్ విహారి
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – విజయ్ కుమార్ కొండా
ప్రొడ్యూసర్స్ – మహిధర్ అండ్ దేవేష్

కథ

విజ‌య్ (రాజ్ త‌రుణ్‌) ఇంజ‌నీరింగ్ పూర్తి చేస్తాడు. హీరోయిన్ ని లవ్ చేసి పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. అయితే అతనికి ఉద్యోగం లేకపోవడంతో హీరోయిన్ తండ్రి పెళ్లికి ఒప్పుకోడు. దానితో అమ్మాయి తండ్రి ఈ పెళ్లికి నిరాక‌రిస్తాడు. దాంతో విజ‌య్ తండ్రి త‌న ఉద్యోగానికి వాలంట‌రీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించి, ఆ ఉద్యోగం త‌న కొడుకుకి వ‌చ్చేలా చేస్తాడు. దాంతో విజ‌య్ పెళ్లికి రూట్ క్లియ‌ర్ అవుతుంది. ఇక అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో తనకు తెలియకుండానే ఒక సమస్యలో ఇరుక్కుంటాడు రాజ్ తరుణ్. అయితే దాని వెనుక ఉన్నది చాలా పెద్దస్థాయి వ్యక్తులని తెలుస్తుంది. అది తెలుసుకున్న రాజ్ తరుణ్ త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి ప్ర‌తీకారం తీర్చుకోవడానికి రంగంలోకి దిగుతాడు. మరి ఆ సమస్యనుండి రాజ్ తరుణ్ ఎలా తప్పించుకున్నాడు అన్నది మిగిలిన కథ..

విశ్లేషణ

రాజ్ తరుణ్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. మొదటి సినిమా తోనే అది అర్ధమైంది. అయితే ఈమధ్య ఏదో కాలం కలిసిరాక సినిమాలు హిట్ అవ్వట్లేదు. ఇక ఈసారి పవర్ ప్లే తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇన్ని రోజులు లవర్ బాయ్ గా ఎంటర్ టైన్ చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు మొదటిసారి జోనర్ ను మార్చి వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని తెరకెక్కించే విజయ్ కుమార్ తెరకెక్కించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే పవర్ ప్లే.

ఒక సామాన్యుడి జీవితం పెద్ద వాళ్ల చేతిలో పడితే ఎంత ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలు తలెత్తుతాయో చెప్పేదే ఈ పవర్ ప్లే. ఏ సస్పెన్స్ థ్రిల్లర్ కి అయినా స్క్రీన్ ప్లే ముఖ్యం. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటింగ్ హైలెట్ గా నిలిచింది. సినిమా స్టార్ట్ అయిన ఓ 15 నిమిషాలూ కాస్త ఓపిక పడితే చాలు అప్ప‌టి నుంచి… క‌థ‌, క‌థ‌నం స్పీడుగా సాగుతాయి. క్లైమాక్స్ వ‌ర‌కూ… ఈ స్పీడు ఎక్క‌డా ఆగ‌దు. అక్క‌డ‌క్క‌డ కొన్ని లాజిక్కులు మిస్ అవుతున్నాయ‌ని అనిపించినా, ద‌ర్శ‌కుడు త‌న క‌థ‌నంతో మ్యాజిక్ చేశాడు. ఇలాంటి సినిమాల‌కు రేసీ స్క్రీన్ ప్లే చాలా అవ‌స‌రం. అది ప‌వ‌ర్‌ప్లేకి బాగా కుదిరింది. ప్ర‌తి పాత్ర‌నీ వాడుకున్న విధానం, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్.. ఇవ‌న్నీ ప‌వర్ ప్లేకి బ‌లాలుగా మారాయి.

ఇక ఈసినిమాలో కొత్త రాజ్ తరణ్ కనిపిస్తాడు. చాలా చక్కగా నటించాడు. తనను తాను కొత్తగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు అందులో సక్సెస్ కూడా అయ్యాడని చెప్పొచ్చు. ఎమోషన్ సీన్స్, తనకు తెలియకుండానే ఎదురవుతున్న పరిస్థితులను చూసి మదనపడే సన్నివేశాల్లో బాగా నటించాడు. ఇక హీరోయిన్ హేమల్ కూడా తనకున్న పాత్ర మేర బాగానే చేసింది.

రాజ్ త‌రుణ్ త‌ర‌వాత‌ అంతస్థాయిలో హైలెట్ అయిన పాత్ర పూర్ణది. చాలా పవర్ ఫుల్ పాత్రలో అహంకార‌పూరిత‌మైన పాత్ర‌లో పూర్ణ నటన అద్భుతం. ఈసినిమాతో పూర్ణకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మ‌ధునంద‌న్‌, ధ‌న్ రాజ్‌ వారి పాత్రల మేర నటించారు. చాలా కాలం త‌ర‌వాత కోట‌శ్రీ‌నివాస‌రావు ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఆండ్రూ కెమెరా స్కిల్స్ ఈ సినిమాకి హైలెట్. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ క‌థ‌కి మరోబలం. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందరికీ నచ్చుతుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 2 =