‘షాదీ ముబారక్’ మూవీ రివ్యూ – సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ

Shaadi Mubarak Movie Review,Latest Telugu Movie Reviews,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Shaadi Mubarak,Shaadi Mubarak Movie,Shaadi Mubarak Movie Public Response,Shaadi Mubarak Movie Public Talk,Shaadi Mubarak Movie Public Talk And Public Response,Shaadi Mubarak Movie Review And Rating,Shaadi Mubarak Movie Updates,Shaadi Mubarak Public Talk,Shaadi Mubarak Public Talk And Public Response,Shaadi Mubarak Review,Shaadi Mubarak Review And Rating,Shaadi Mubarak Telugu Movie,Shaadi Mubarak Telugu Movie Latest News,Shaadi Mubarak Telugu Movie Public Response,Shaadi Mubarak Telugu Movie Public Talk,Shaadi Mubarak Telugu Movie Public Talk And Public Response,Sagar Shaadi Mubarak Telugu Movie Review,Shaadi Mubarak Telugu Movie Review And Rating,Sagar Shaadi Mubarak Telugu Movie Review,Sagar Shaadi Mubarak Movie Review

మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడిగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సాగర్ ఈసారి పద్మశ్రీ దర్శకత్వంలో ప్రస్తుతం ‘షాదీ ముబారక్’ సినిమాతో వస్తున్నాడు. ఇక ఈసినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే మ్యాటర్ ఉంటే కాని దిల్ రాజు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. దీనితో ఈ సినిమాలో కూడా విషయం ఉండే ఉంటుంది అందుకే దిల్ రాజు నిర్మించాడు అన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇక దానికి తగ్గట్టే సినిమా టీజర్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఇంటిపేరు నేపథ్యంలో ఈసినిమా వస్తుందని ఇప్పటికే అర్ధమైంది.
కాగా దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మూవీ నేమ్ : షాదీ ముబారక్ (తెలుగు )
మూవీ డీటెయిల్స్ :
మూవీ – షాదీ ముబారక్
నటీనటులు – సాగర్ ఆర్ కె నాయుడు , దృశ్య రఘునాథ్, రాహుల్ రామ‌కృష్ణ, హేమంత్, భద్ర‌మ్, బెన‌ర్జీ, హేమ‌, రామ్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, అజ‌య్ ఘోష్
డైరెక్టర్ – పద్మ శ్రీ
ప్రొడ్యూజర్స్ – దిల్ రాజు , శిరీష్
మ్యూజిక్ : సునీల్ కశ్యప్
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : శ్రీకాంత్ నారోజ్

కథ

సున్నిపెంట మాధ‌వ్‌(వీర్‌సాగ‌ర్‌) చిన్న‌ప్పుడే తన తల్లి దండ్రులు చనిపోవడంతో పిన్ని బాబాయ్‌ల ద‌గ్గ‌రే పెరుగుతాడు. ఇక ఉద్యోగరీత్యా మాధవ్ ఆస్ట్రేలియాలోనే ఉంటాడు. అయితే ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న నేపథ్యంలో ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తారు మాధ‌వ్ పిన్ని బాబాయ్‌. ఈ క్రమంలో ఆ మ్యారేజ్ బ్యూరోను నిర్వహించే ‌రాజ‌శ్రీనాయ‌ర్‌ అతనికి పెళ్లి చూపులు ఎరేంజ్ చేస్తుంది.పెళ్లి చూపుల కోసం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వ‌స్తాడు మాధవ్. ఒకే రోజు మూడు పెళ్ళిచూపులు అరేంజ్ చేస్తుంది రాజ‌శ్రీనాయ‌ర్. అదే సమయంలో రాజ‌శ్రీనాయ‌ర్‌ కు చిన్న సమస్య రావడంతో అతనితో వెళ్లలేని పరిస్థితి వస్తుంది. అయితే మాధ‌వ్‌ను పెళ్లి చూపుల‌కు తీసుకెళ్ల‌ే బాధ్యతను త‌న కుమార్తె తుపాకుల స‌త్య‌భామ‌(ద‌శ్యా ర‌ఘునాథ్‌)కు అప్ప‌గిస్తుంది. దీనితో మాధ‌వ్‌ను మూడు పెళ్లి చూపుల‌కు తీసుకెళుతుంది స‌త్య‌భామ‌. ఈ ప్ర‌యాణంలో మాధ‌వ్, స‌త్య‌భామ‌ల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది.? మాధ‌వ్‌, స‌త్య‌భామ ఎలా ఒక‌ట‌వుతారు? అనే విషయాలు తెలియాలంటే ‘షాదీ ముబారక్’ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

చిన్న సినిమా అని కాదు పెద్ద సినిమా అని కాదు… ప్రేక్షకుడికి నచ్చితే చాలు. కోట్లు పెట్టి సినిమా తీయక్కర్లేదు.. ప్రేక్షకుడిని కూర్చోపెట్టే సినిమా తీస్తేచాలు అదే ఆడుతుంది. ఈ విషయాన్ని ఇప్పుడు మరోసారి నిజం చేసింది షాదీ ముబారక్ సినిమా.

ఇక ఈసినిమా విషయానికొస్తే.. ఈసినిమాకు అంత హైప్ రావడానికి మెయిన్ కారణం దిల్ రాజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమాను ఎప్పుడైతే దిల్ రాజు తన భుజాలమీద వేసుకున్నాడో అప్పుడే ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కంటెంట్ ఉంటే కానీ అంత సులువుగా దిల్ రాజు ఒప్పుకునే మనిషి కాదు. ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈసినిమా దిల్ రాజు నమ్మకాన్ని దాదాపు నిలబెట్టిందనే అనిపిస్తుంది.

డైరెక్టర్ పద్మశ్రీ ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఓ వైపు ఎంటర్టైన్మెంట్.. మరోవైపు లవ్ స్టోరీ.. రెండింటినీ పర్ఫెక్ట్ గా బాలెన్స్ చేశాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి సన్నివేశాలు రాసుకున్నాడు. నిజానికి ఓ సింపుల్ పాయింట్ ను తీసుకుని రెండు గంటల సినిమాగా తీయడం సామాన్య విషయం కాదు. అందుకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకత్వం వహించిన పద్మశ్రీని మొదట అభినందించాలి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో పెళ్ళిచూపులకు వెళ్లడం కారులో తిరగడమే ఉంటుంది. అయితే కారులోనే కథ నడుస్తున్నా.. డైరెక్టర్ మాత్రం ఎక్కడా బోర్ కొట్టకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లోకాస్త వేగం తగ్గినా ఓవరాల్ గా మాత్రం మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూసిన ఫీలింగ్ వస్తుంది.

ఇక హీరో సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్ తో మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు సాగర్. ఆ ఆదరణతో ‘సిద్ధార్థ’, ఆ తరువాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’ సినిమాలు చేశాడు కానీ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా పట్టు వదలకుండా ఇప్పుడు ‘షాదీ ముబారక్‌’ తో వచ్చేశాడు. అయితే మొదటి రెండు సినిమాల్లోలాగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా కూల్ గా వెళ్లే లవ్ స్టోరీని సెలక్ట్ చేసుకున్నాడు. ఇక మాధవ్ పాత్రలో ఎంత వరకూ నటించాలో అంత వరకే నటించాడు. సీరియల్స్ లో నటన ఎలా ఉంటుందో మనకు తెలుసు.. అలా భారీ భారీ డైలాగ్స్ లేకుండా.. ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ లేకుండా చాలా సెటిల్డ్ గా నటించాడు.

ఇక హీరోయిన్ దృశ్యా ర‌ఘునాథ్‌ ఈసినిమాకు ప్లస్ పాయింట్. తొలి సినిమానే అయినా ఆమె నటిస్తున్నప్పుడు అలాంటి భావన ఎక్కడా రాదు. సహజమైన న‌ట‌న‌తో చ‌క్క‌గా ఆక‌ట్టుకుంది.

హీరో స్నేహితుడిగా భద్ర‌మ్ చేసిన బంతి బాలు పాత్ర ఉండేది త‌క్కువే అయినా, హీరో సీక్రెట్స్ అంతా రివీల్ చేస్తూ కామెడీని క్రియేట్ చేయడంలో భ‌ద్ర‌మ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. అలాగే కారు డ్రైవ‌ర్ ర‌మేష్ పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఒదిగిపోయాడు. తెలంగాణ యాస‌లో త‌న భార్య‌, బావ మ‌రిదితో ఫోన్‌లో మాట్లాడే స‌న్నివేశాలు, డైలాగులు ఈ పాత్ర‌ను ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ చేస్తాయి. సెకండాఫ్ లో హేమంత్ కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మిగిలిన నటీనటులు బెన‌ర్జీ, హేమ‌, రామ్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, మ‌ధునంద‌న్‌, అజ‌య్ ఘోష్ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌ మేర బాగానే నటించారు.

ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే సునీల్ క‌శ్య‌ప్ అందించిన సంగీతం బాగానే ఉంది. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు నచ్చుతుందో లేదో చెప్పలేం కానీ లవ్ స్టోరీస్ చూసే వాళ్లకు మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పొచ్చు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =