అశ్వథ్థామ, భీష్మ సినిమాల్లో తన నటనతో మెప్పించిన బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నాడు. ఇప్పటికే జిషు సేన్ గుప్తా ఆచార్య లో విలన్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో అవకాశం ఆ నటుడిని వరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా కోల్ కత్తాలో కీలక భాగాలను చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడం చూశాం. బ్రిటిష్ ఇండియా కాలం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని నాని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ను నిహారిక ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ అందించింది. శ్యామ్ సింగరాయ్‌లో బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా కూడా నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మోస్ట్ టాలెంటెడ్, డెడికేటెడ్ యాక్టర్ జిషు సేన్ గుప్తాకు రాయల్ వెల్‌కమ్ అంటూ తమ అధికారిక ట్విటర్ లో పోస్ట్ చేసింది.
Welcoming the Most Talented & Dedicated Actor @Jisshusengupta on Board for #ShyamSinghaRoy 🔥
Royally Welcome aboard sir 🙌🏻
A @Rahul_Sankrityn Film 🎬
Natural 🌟 @NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @SVR4446 @vboyanapalli @NiharikaEnt pic.twitter.com/16t2TFha8W
— Niharika Entertainment (@NiharikaEnt) March 2, 2021
కృతిశెట్టి, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: