శేష్ న్యూ మూవీ- శృతి హాసన్ ప్రీ లుక్ రిలీజ్
కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినశృతి హాసన్ తండ్రికి తగ్గ తనయగా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక వరుస సినిమాలు హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాసన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ పడింది. ఈ ఏడాది ఏకంగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకుంది శృతి. అది కూడా అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి లతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి హిట్లను అందుకుంది. దీంతో మళ్లీ బిజీ అయిపోయింది…
పూర్తి వార్త చదవండి


















