శివ కార్తికేయన్ ‘అయలాన్’కి వాయిస్ అందిస్తోన్న హీరో సిద్దార్థ్

Siddharth Lends Voice For Shiva Karthikeyan's Ayalaan Movie

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. తెలుగులోనూ శివ కార్తికేయన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్, ‘జాతి రత్నాలు’ ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో ‘ప్రిన్స్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే ‘మహా వీరుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘అయలాన్’ మూవీ సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇండియాలోనే తొలిసారిగా ‘ఏలియన్’ కథాంశంతో రూపొందుతున్న మూవీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగా గత కొన్నిరోజుల క్రితం ‘అయలాన్’ టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ నుంచి మరో సాలిడ్ అప్‌డేట్ అందించారు. ఈ చిత్రంలో ‘ఏలియన్’ క్యారక్టర్ కి స్టార్ హీరో సిద్దార్థ్ తన గాత్రం అందించనున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ పాత్రకి సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ చేసిన సిద్దార్థ్ కి థాంక్స్ కూడా తెలిపారు.

ఇక ‘అయలాన్’ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శరద్ కేల్కర్ మరియు ఇషా కొప్పికర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేఆర్‌ స్టూడియోస్ బ్యానర్‌పై కోటపాడి రాజేష్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విస్తృత కథాంశం కలిగి ఉండటంతో దీనిని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + thirteen =