రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కు విడుదలకు ముందు అన్ని కలిసి వస్తున్నాయి. మొన్న రిలీజైన ఒక్క సాంగ్ తో నెగిటివిటీ అంతా మాయపొయింది.మొదటి సాంగ్ గా వచ్చిన సూరీడు స్లో పాయిజన్ లా మెల్లిగా ఎక్కుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో వచ్చిన ఈసాంగ్ ఈఏడాది బెస్ట్ సాంగ్స్ లో ఒకటి గా నిల్చింది.మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ అద్భుతమైన ట్యూన్స్ కు తోడు అర్ధవంతమైన లిరిక్స్ తో వచ్చిన ఈసాంగ్ కు యూనానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనికి తోడు సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చింది.రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.అంతేకాదు 176నిమిషాల నిడివి వున్న ఈసినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులనుండి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇండస్ట్రీ సర్కిల్ లోకూడా సినిమా ఆదిరిపోయిందని వార్తలు వస్తున్నాయి.దాంతో ప్రభాస్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న విజయం సలార్ ఇచ్చేలానే వుంది.ఇక ఓపెనింగ్స్ విషయంలో సరి కొత్త రికార్డులు క్రీయేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు 1000కోట్లు క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయంలో క్లారిటీ రాగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ గా నున్నాయి.కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.భారీ బడ్జెట్ తో విజయ్ కిరగందుర్ నిర్మించాడు.తెలుగుతోపాటు ఈనెల 22న మిగితా భాషల్లో రికార్డు స్థాయిలో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: