టాలీవుడ్‌లో కొందరు హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. దీంతో మళ్ళీ వీరు ఎప్పుడు కలిసి వర్క్ చేస్తారా అని అటు అభిమానులతోపాటు ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారిలో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ ఒకటి. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన ‘మిరపకాయ్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికంటే ముందు ‘షాక్’ సినిమాతో హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు ‘మాస్ మహారాజా’ అనే ట్యాగ్ ఇచ్చింది హరీష్ శంకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా వీరు మూడోసారి చేతులు కలిపారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మాస్, క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం ధమకేధార్ ఎంటర్‌టైనర్‌ను అందించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు. హరీష్ శంకర్ తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్‌లో చూపించడంలో దిట్ట.
ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, మాసెస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందో తెలియజేయడానికి .. ‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కోసం హరీష్ శంకర్ ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌కి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: