పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు ఒకవైపు రాజకీయాతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల షూటింగ్ లను కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య పూర్తిగా రాజకీయాలతోనే బిజీఅయిపోయారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సినిమాల షూటింగ్ లు పెండింగ్ లో పడిపోయాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాల నుండి అప్డేట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈనేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ కు ఓజీ మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. పవన్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. నిజానికి మూవీ షూటింగ్ జరుగుతున్న టైంలో మేకర్స్ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చారు. కానీ గత కొద్దికాలంగా ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అప్ డేట్లు అడగడం మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే క్లారిటీ ఇచ్చారు.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్‌తో టైం లైన్ ఫుల్లైంది.. సాధారణంగానే అభిమానులు అంటే ఫుల్ హంగ్రీతో ఉంటారు.. మీకు ఇది తెలియాలనే చెబుతున్నాం.. ఇప్పుడు షూటింగ్ జరగడం లేదు.. అందుకే అప్డేట్లు రావాలంటే ఇంకా టైం పడుతుంది.. ఇక్కడ మీరు వెయిట్ చేయకండి.. డోంట్ స్టే ట్యూన్డ్ హియర్ అని ట్వీట్ వేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.
Timeline is filled with birthday wishes. 🫠🙄 Fans are Naturally Hungry. Just to let you know, we’re not shooting now, so it will take a little more time to get updates. Don’t stay tuned here.
— DVV Entertainment (@DVVMovies) December 12, 2023
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































