కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినశృతి హాసన్ తండ్రికి తగ్గ తనయగా పేరును సంపాదించుకుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మొదట వరుస ప్లాప్స్ తో కాస్త ఇబ్బంది పడ్డ శృతి ఆ తర్వాత చాలా మంది హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక వరుస సినిమాలు హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాసన్ కెరీర్ కు మధ్యలో బ్రేక్ పడింది. ఈ ఏడాది ఏకంగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకుంది శృతి. అది కూడా అగ్రహీరోలైన బాలకృష్ణ, చిరంజీవి లతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో మంచి హిట్లను అందుకుంది. దీంతో మళ్లీ బిజీ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో క్రేజీ హీరోతో సినిమా చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అడివి శేష్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ఒక సినిమా రాబోతుంది. షనైల్ డియో దర్శకత్వంలో లవ్ స్టోరీ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్డేట్లను బట్టి అర్థమవుతుంది. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గానే శేష్ ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అలానే తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నశృతీ హాసన్ ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే టైటిల్ ను డిసెంబర్ 18వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
HER fury exists because of HIS fire ❤️🔥
Introducing @shrutihaasan as the other half of the most anticipated #SeshEXShruti 💥
Title and First Look out on December 18th 🔥
Get ready to witness the daredevil duo 🔥@AdiviSesh @Deonidas #SupriyaYarlagadda @AsianSuniel… pic.twitter.com/4VOQvBenC0
— Annapurna Studios (@AnnapurnaStdios) December 16, 2023
కాగా ఈసినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: