హాయ్ నాన్నపై అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నారంటే?

Allu Arjun Reviews Hi Nanna and Praises Movie Unit

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్‌ నాన్న’. ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించగా.. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. మలయాళం కంపోజర్‌, ‘హృదయం’ ఫేమ్ హేశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ అందించిన హర్ట్‌ టచింగ్ ట్యూన్స్‌ సినిమాకి ఎస్సెట్ గా నిలిచాయి. కాగా శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం తన మనసుకు హత్తుకుందని, ఇందులోని నటీనటుల పెర్మార్మెన్స్ ఆకట్టుకుందని అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ‘హాయ్‌ నాన్న’ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్.. ఈ మేరకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా సినిమాకు రివ్యూ ఇచ్చారు. అందులో ఇలా తెలిపారు.. “బ్రదర్ నాని నటన అద్భుతం. ఇంత గొప్ప స్క్రిప్ట్‌ని వెలుగులోకి తెచ్చినందుకు టీమ్‌ మీద రెస్పెక్ట్‌ పెరిగింది. స్క్రీన్ పైన మృణాల్‌ ఠాకూర్ నటన మనసును వెంటాడేలా చేసింది. తనలాగే ఆ పాత్ర కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మై డార్లింగ బేబీ కియారా.. నీ క్యూట్‌నెస్‌తో మనసుల్ని కరిగించేశావు. ఇక చాలు, నువ్వు వెంటనే స్కూల్‌కి వెళ్లిపో (స్మైలింగ్ ఎమోజీస్). మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కడా పేరు పెట్టడానికి లేకుండా తమ ప్రతిభను చూపించారు” అని కొనియాడారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని తెరపై కనిపిస్తోంది. ముఖ్యంగా కెమెరామెన్ సాన్ జాను వర్గీస్‌, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ గొప్ప టెక్నీషియన్స అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక దర్శకుడు శౌర్యువ్‌ తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్నో హృదయాలను హత్తుకునేలా, కంట తడి పెట్టేలా సన్నివేశాలను క్రియేట్‌ చేశారు. సీన్స్ ప్రజంటేషన్ చాలా బావుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా మెచూర్డ్‌గా చిత్రీకరించారు, అద్భుతమైన స్క్రిప్ట్‌ని ఎంకరేజ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు నా అభినందనలు. ‘హాయ్‌ నాన్న’ చిత్రం తండ్రులనే కాకుండా ప్రతి ఫ్యామిలీ మెంబర్ హృదయాన్ని హత్తుకుంటుంది’’ అని అల్లు అర్జున్ తెలిపారు.

ఇక అల్లు అర్జున్ పెట్టిన ట్వీట్‌కు హీరో నాని రిప్లై ఇచ్చాడు. “ఇప్పుడు అర్హ నాన్న కూడా హాయ్ నాన్న‌ సినిమా బాగుంద‌ని అప్రూవ్ చేశాడు. మంచి సినిమాల‌కు బన్నీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్యూ సో మచ్ బన్నీ” అని ఆయన త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రం తెలుగునాటే కాకుండా ఓవర్ సీస్‌లో సైతం మంచి కలెక్షన్సే రాబడుతోంది. ఈ క్రమంలో అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడంతో పాటు.. ఈ ఘనత సాధించిన నాని తొమ్మిదో సినిమాగా హాయ్ నాన్న నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =