ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ అయిపోయింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినా కథపై మాత్రం కాస్త కన్ఫ్యూజన్ మాత్రం నెలకొంది. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ మాత్రం ఈసినిమా గురించి చెబుతూ క్లారిటీ ఇచ్చాడు. సలార్ పూర్తిగా డిఫరెంట్ వరల్డ్.. ఈసినిమాలో యాక్షన్ పెద్ద స్థాయిలో ఉంటుంది.. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి.. ముఖ్యంగా ఇది ఒక ఎమోషనల్ స్టోరీ.. ఖాన్ సార్ అనే ప్రపంచంలో ఇద్దరి స్నేహితులు, వారి జర్నీఉంటుందని తెలిపారు. ఎమోషన్స్ ఇంకా ఫ్రెండ్ షిప్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ సినిమాను తీయాలనుకున్నాను.. సలార్ తో ఆ ఆవకాశం వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























