రానా దగ్గుబాటి – డైరెక్టర్ తేజ కాంబోలో రాక్షస రాజా

Rana Daggubati and Director Teja Re-unite Again For New Film Rakshasa Raja

‘బాహుబ‌లి’ సిరీస్ తర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి. ప్ర‌స్తుతం ఆయన ర‌జ‌నీకాంత్ ‘వేట‌గాడు’లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్నారు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న పౌరాణిక సినిమా ‘హిర‌ణ్య‌క‌శ్య‌ప’ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రానా దగ్గుబాటి మరో క్రేజీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు. చిన్న చిత్రాలతో పెద్ద హిట్స్ అందుకునే ప్రముఖ దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గురువారం రానా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయడం విశేషం. కాగా ఈ సినిమాకు ‘రాక్ష‌స‌రాజా’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్ట‌ర్‌లో రానా, భుజంపై గ‌న్ పెట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తోన్నాడు. అలాగే నోటిలో సిగార్‌తో నుదిటిపై విభూతి రేఖలు, పెద్ద బొట్టు ఉండ‌టం ఆస‌క్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. అయితే ‘రాక్ష‌స‌రాజా’ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని కొత్త పాత్ర‌లో అత‌డు క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మరోవైపు ‘రాక్ష‌స‌ రాజా’ను పాన్ ఇండియ‌న్ మూవీగా రూపొందించేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు త్వ‌ర‌లోనే వెల్లడించనున్నారు. కాగా ఇంతకుముందు రానా, డైరెక్టర్ తేజ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘నేను రాజు నేనే మంత్రి’ సినిమా సాలిడ్ హిట్ అనిపించుకుంది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కానుండటంతో ఈ చిత్రంపై ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 15 =