ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్.. నెట్టింట వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోలు, 'ఆర్ఆర్ఆర్' కో స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌లు ఒకేచోట కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు వీరు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి ఎయిర్ పోర్ట్‌లో కలుసుకోగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకై బేగంపేట విమానాశ్రయం వద్దకు వచ్చారు. గుజరాత్ లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ వివాహం జరుగనున్న సంగతి తెలిసిందే.
పూర్తి వార్త చదవండి


















