గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. జాక్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నార్త్ అమెరికా హక్కులను రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు మరేవో కాదు ఇప్పటికే పలు తెలుగు సినిమాలను రిలీజ్ చేసిన ప్రత్యంగిర సంస్థ ఇంకా క్రియేషన్స్ వారు. ఈరెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నాయి. ఈసినిమా మాత్రమే కాదు మరో రెండో మోస్ట్ అవైటెడ్ సినిమాల హక్కులను కూడా ఈ సంస్థలు సొంతం చేసుకున్నాయి. ధనుష్-నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇంకా నాగచైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమా నార్త్ అమెరికా హక్కులను ఈ సంస్థవారు సొంతం చేసుకున్నారు.
This time, it’s #JACK 🔥
Thrilled to bring the crazy madness to the North American audience ❤️
See you at the cinemas soon!#SidduJonnalagadda#SVCC37 @iamvaishnavi04@baskifilmz @SVCCofficial @AACreationsUS pic.twitter.com/NedtHQclbt
— Prathyangira Cinemas (@PrathyangiraUS) February 27, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: