లియోతో గత ఏడాది కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దళపతి విజయ్ ప్రస్తుతం తన 68వ సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం)లో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట.అత్యంత భారీ ధరకు ఈరైట్స్ ను దక్కించుకుందని టాక్.ఇంతకుముందు లియో డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్సే దక్కించుకుంది.ది గోట్ లో సీనియర్ హీరో ప్రశాంత్ ,లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.దీపావళికి విడుదలచేసే ప్లాన్ లో వున్నారు.
ఇదిలావుంటే విజయ్ ఈసినిమా తరువాత మరో సినిమా మాత్రమే చేయనున్నాడు.ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ గా బిజీ అవ్వనున్నాడు.రీసెంట్ గా తన పార్టీ పేరును కూడా ప్రకటించాడు.2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.ఇక తన 69వ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నాడు.ఇందుకోసం విజయ్ భారీ పారితోషికం తీసుకోనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: