టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివజ్జగన్ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలుస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here is the spine-chilling release of #Sabdham!
Best wishes to @AadhiOfficial and the entire team ♥️
https://t.co/0DZRZWYgyzAn @dirarivazhagan Film
A @MusicThaman Musical@7GFilmsSiva@Aalpha_frames @SimranbaggaOffc@Lailalaughs#LakshmiMenon pic.twitter.com/rc3JH9oVHF— Venkatesh Daggubati (@VenkyMama) April 12, 2024
కాగా ఈసినిమాలో సీనియర్ హీరోయిన్స్ లైలా, సిమ్రాన్ కూాాడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను 7జీ ఫిలింస్ ఇంకా ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: