తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. ముందు జనవరి అనుకున్నారు ఆ తరువాత ఫిబ్రవరి అనుకున్నారు కానీ రిలీజ్ కాలేదు. దీంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఏప్రిల్ 17వ తేదీన విక్రమ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆరోజే తంగలాన్ రిలీజ్ డేట్ పై మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ఆరోజైనా రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందో?లేదో?
కాగా ఈసినిమాలో పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: