మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి వచ్చిన సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఫైనల్ గా ఎన్నో అంచనాల మధ్య మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతంచేసుకుంది. ముఖ్యంగా సుకుమార్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది. అన్ని బాషల్లో కలిపి ఈ వసూళ్లను రాబట్టింది ఇక ఈ విషయాన్ని పోస్టర్ రిలిజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
కాగా ఈసినిమాలో అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందించారు. జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా నిర్మించాయి. తెలుగులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: