గీతాంజలి మళ్లీ వచ్చింది.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Geethanjali Malli Vachindhi Trailer Release Date Fixed

తెలుగు అమ్మాయి అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ‘నిన్ను కోరి’, ‘నిశ్శ‌బ్దం’ చిత్రాల‌కు కొరియోగ్ర‌ఫీ చేసిన అట్లాంటా (యూఎస్‌)కు చెందిన కొరియోగ్రాఫ‌ర్ శివ తుర్ల‌పాటి ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై నిర్మాతలు ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి’ అంటూ వస్తోన్న ఈ మూవీ అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు మరియు ప్రచారచిత్రాలు మంచి ఆదరణ దక్కించుకోగా.. తాజాగా మరో సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈనెల 3వ తేదీన ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ఇక ఇప్పటికే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను నైజాం ఏరియాలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో.. ప్రాజెక్టులోకి దిల్ రాజు ఎంటరవడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. కాగా కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా మ‌ల‌యాళ చిత్ర పరిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు రాహుల్ మాధ‌వ్‌ టాలీవుడ్‌కు ప‌రిచ‌యమవుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =