టిల్లు స్క్వేర్ సూపర్ ఫన్ రైడ్

natural star nani praises on tillu square movie

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈసినిమా దుమ్మురేపుతుంది. మొదటిరోజే ఈసినిమా 23 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. రెండు రోజుల్లో ఈసినిమా 45 కోట్లు కలెక్ట్ చేసిన ఈసినిమా మూడు రోజుల్లో ఈసినిమా 68 కోట్లు దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాను చూసిన సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే న్యాచురల్ స్టార్ నాని కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ టిల్లు స్క్వేర్ సూపర్ ఫన్ రైడ్ సినిమా.. టిల్లు పాత్రలో సిద్దూ రెండు గంటలపాటు అద్బుతంగా నటించాడు.. వాట్ ఏ మూవీ.. టీమ్ అందరికీ కంగ్రాట్య్చూలేషన్స్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 6 =