పాకిస్థాన్‌, చైనాలతో ఇండియా వార్స్ గురించి అద్భుతంగా చెప్పిన నాగబాబు

Naga Babu Praises Indian Army Against Pakistan and China Wars

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వరుణ్ తేజ్ తండ్రి, నటుడు నాగేంద్రబాబు కూడా ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. “మెగా అభిమానులందరికీ కృతజ్ఞతలు. నా పిల్లలు, అందరి బిడ్డలు బాగుండాలి.. దేశ సరిహద్దుల్లో ఉండే సైనికులు బాగుండాలని మా అమ్మ దైవాన్ని ప్రార్థిస్తుంది. మా అమ్మ వాళ్ల నాన్న, మేనమామ, మా పెద్దనాన్న మిలటరీలో పనిచేశారు. టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో పెద్దనాన్న చెప్పేవారు. యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్‌ వారు ముందుగా ఎటాక్‌ చేస్తుంటారు. 1965 పాకిస్థాన్‌ వార్‌ సమయంలో అత్యాధునిక రాడార్‌ను అమెరికా ఆ దేశానికి అందించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అలీ బ్రదర్స్‌ సాహసోపేతంగా ఆ రాడార్‌ను ధ్వంసం చేశారు. ఆ దెబ్బకి పాక్ ఆర్మీ తేరుకోలేదు. అలాగే ఆ తర్వాత మరోసారి 1962 చైనా వార్‌లో మన ఆర్మీ పోరాటం చూసి చైనా ఆర్మీ ప్రశంసించింది” అని గుర్తుచేసుకున్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “వరుణ్‌ తేజ్ ఎప్పుడూ కొత్తదనంతో కూడిన సినిమాలు చేయాలని భావిస్తుంటాడు. దానికోసం ఎక్కువ రిస్క్‌ తీసుకుంటాడు. ఇక వరుణ్‌ కథలు, పాత్రలు ఎంపిక చేసుకునే విధానం నాకు బాగా ఇష్టం. మన ఆర్మీ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని తీయడం చాలా అనందంగా వుంది. అక్టోబర్ లో నా పుట్టిన రోజుకి అమ్మ కొంత డబ్బు ఇచ్చింది. దానికి ఇంకొంత కలిపి ఒక ఆరు లక్షల రూపాయిలు ఇండియన్ డిఫెన్స్ వీరనారి వారికి అందిస్తున్నాం. ఈ మొత్తాన్ని త్వరలోనే వరుణ్, ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత వెళ్లి ఆ డబ్బుని అందిస్తారు. జై హింద్” అని అన్నారు నాగబాబు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =