దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటించాడు. ఇక ఈసినిమా ఫిబ్రవరి2వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఎప్పటిలాగే సుహాస్ తన నటనతో మెప్పించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మార్చి 1 వ తేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈసినిమాలో శివాని హీరోయిన్ గా నటించగా.. పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిర్మించగా.. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























