టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘మా పెద్దనాన్న నాకు స్ఫూర్తి. ఆయన మా సినిమా టీమ్‌ని విష్ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెబుతుంటారు పెద్దనాన్న. ఇంతమంది అభిమానుల్ని మాకు ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్ కృతజ్ఞతలు. అభిమానుల ప్రోత్సాహానికి, ప్రేమకి రుణపడి ఉంటాను. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతోనే నేనెప్పుడూ కష్టపడుతుంటాను” అని అన్నారు.
వరుణ్ తేజ్ ఇంకా మాట్లాడుతూ.. “ఈ చిత్రాన్ని శక్తిప్రతాప్ ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో మన దేశ వైమానిక దళ వీరుల త్యాగాల్ని, గొప్పతనాన్ని చాటేలా ఎంతో గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి ధన్యవాదాలు. మిక్కీ జే మేయర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఫైటర్ విజయ్ మాస్టర్, ఎడిటర్ నవీన్ నూలీ, డీవోపీ హరి అందరూ అద్భుతంగా పని చేశారు. నిర్మాతలు సిద్దు, సోనీ పిక్చర్స్ కి ఆల్ ది బెస్ట్. మన కోసం ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని రక్షించే సైనికుల మీద సినిమా చేయడం చాలా గర్వంగా వుంది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వాడు గుండెలపై చేయి వేసుకొని మన జవాన్లకు సెల్యూట్ కొడతారు. అలా ఉండనుంది ఈ సినిమా. మార్చి 1 తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడాలి’’ అని కోరారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























