అల్లు అర్జున్ తనయుడిపై షారుఖ్ సూపర్ ట్వీట్

Shah Rukh Khan Reacts to Allu Arjun's Son Sings Dunki Song

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం ‘డంకీ’. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాప్సి పన్ను కథానాయికగా నటించగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ గతేడాది హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. అంతకుముందు ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు నెలకొల్పాయి. వీటి తర్వాత వచ్చిన ‘డంకీ’ చిత్రం ఈ స్థాయిలో కాకపోయినా, బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇక ఈ మూవీలోని ‘లుట్ పుట్ గయా’ అనే పాట సూపర్ హిట్టయింది. నెట్టింట దీనిపై అనేక రీల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ పాటను అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పాడాడు. అల్లు అయాన్ కారులో వెళ్తున్న సమయంలో ఈ పాటను హమ్ చేశాడు. ఇక ఈ వీడియోను షారుక్ ఖాన్ ఫ్యాన్స్ క్లబ్ అనే ఎక్స్ అకౌంట్‍లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో షారుఖ్ ఖాన్ దీనిపై స్పందించాడు. ఈ మేరకు ఆయన.. “థ్యాంక్యూ లిటిల్ వన్.. నువ్వో ఫ్లవర్, ఫైర్ కలగలపిన వ్యక్తివి. నేను ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీవల్లీ పాటను మా పిల్లలతో పాడించడానికి ప్రయత్నిస్తా” అని పేర్కొన్నాడు. కాగా అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా లోని ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ’ అనే పాపులర్ డైలాగ్‌ను గుర్తు చేస్తూ అయాన్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఇక దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. ఎక్స్ మీడియా వేదికగా ఆయన.. “షారుఖ్ జీ.. అది మీ మంచితనం. మీ స్వీట్ సందేశానికి కృతజ్ఞతలు. చాలా ప్రేమతో..” అని రిప్లై ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ ఇరువురి స్టార్ హీరోల అభిమానులు వీటిని రీట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇందుకు కారణమైన అల్లు అయాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇంతకుముందు కూడా బన్నీ ‘జవాన్’ సినిమా చూసి సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ నటనపై ప్రశంసలు కురిపించగా.. అప్పుడు కూడా షారుఖ్ స్పందించి ‘పుష్ప’ సినిమాను తాను మూడు సార్లు చూశానని, అల్లు అర్జున్ నటన తనకెంతో నచ్చిందని ప్రశంసించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =