ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఫిబ్రవరి16 వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమాకు మంచి రివ్యూసే వచ్చాయి. చాలా కాలం తరువాత సందీప్ కిషన్ కు ఈసినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందిస్తుంది. మూడు రోజుల్లోనే ఈసినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకోగా ఒక్క నైజాం లోనే 5 కోట్లు కలెక్ట్ చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాను పిల్లల కోసం స్పెషల్ షోను వేయనున్నట్టు తెలిపారు. ఏఎంబీ సినిమాస్ లో ఈసినిమా స్పెషల్ షో వేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
MAGICAL ENTERTAINER #OoruPeruBhairavaKona SPECIAL SHOW FOR KIDS 😍
Today at @amb_cinemas 🔥https://t.co/OV3enwDhNJ@sundeepkishan’s much-anticipated,
A @Dir_Vi_Anand FantasyIN CINEMAS NOW❤️🔥@VarshaBollamma @KavyaThapar #ShekarChandra @AnilSunkara1 @RajeshDanda_… pic.twitter.com/emESYwneuR
— AK Entertainments (@AKentsOfficial) February 22, 2024
ఈసినిమాలో సందీప్‌కు జోడీగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: