శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్

sree vishnu new movie title and first look out now

సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈమధ్యే సామజవరగమన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో బ్రోచేవారెవరురా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి నిన్న చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ముగ్గురు ఏలియన్స్ భూమి మీదకు దిగినట్టు ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఓం భీమ్ బుష్’ అనే టైటిల్ పెట్టారు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనేది ట్యాగ్ లైన్. ముగ్గురు ఏలియన్స్ గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 16 =