శంషాబాద్ లో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆవిష్కరించిన సోనూసూద్

sonu sood inaugurates government school building in shamshabad

సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి సొంత నిధులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సినీ నటుడు సోనుసూద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భవనాన్ని ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాఠశాల విద్యార్థులు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను, బుక్స్ ను సోనూసూద్ చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు నా హృదయానికి చాలా దగ్గర అని అన్నారు. తాను పంజాబీ నుంచి వచ్చినా తన సతీమణీ మాత్రం తెలుగు అమ్మాయి అని చెప్పారు. సినిమా పరంగా ఆయన కెరియర్ కూడా తెలుగు నుంచే మొదలు అయిందని, ఇక్కడే నటనలో వృద్ధి చెందాను అని వెల్లడించారు. అందుకే తెలుగు వాళ్లు అన్నా, తెలుగు అన్నా ప్రత్యేక అభిమానం అని తెలిపారు. చాలా మంది అంటుంటారు బాలీవుడ్ లో హీరోగా చేస్తావు, తెలుగులో విలన్ గా చేస్తావు ఎందుకు అని, తెలుగులో నటించడం అంటే ఎందుకో చాలా ఇష్టం అందుకే తెలుగు నుంచి ఏ క్యారెక్టర్ వచ్చినా కచ్చితంగా మీ కోసం చేస్తాను అని పేర్కొన్నారు.

తన చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, స్కూల్ అనేది బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల కన్న చాలా గొప్పది అని అన్నారు. తన సినిమా రూ. 500 కోట్లు వసూళ్లు చేసినా, రూ. 1000 కోట్లు వసూళ్లు చేసినా వచ్చే ఆనందం కన్నా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తే వచ్చే ఆనందం చాలా ఎక్కువ అన్నారు. కోవిడ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ఎంత సేవా చేసిందో అందరికీ తెలిసిందే అలాగే సిద్ధు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు విద్యార్థుల కోసం ఉచిత పాఠశాల భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది అని సోనూసూద్ పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాలలో అన్నింటికన్నా ముఖ్యమైనది విద్యార్థులకు చదువు చెప్పించడం, మనలో కూడా వీలైనవాళ్లు ఒకరిద్దరి పిల్లల చదువుకు సాయం చేయాలి అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకోసం, పాఠశాలలో కోసం నా అవసరం ఉంటే కచ్చితంగా తెలియచేయండి, నా వంతు సాయం తప్పకుండా ఉంటుందని, ఒక విద్యార్థి కూడా చదువుకు దూరం అవకూడదు అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =