సిద్దార్ట్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సినిమా ఫైటర్. ఈసినిమా గత నెలలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్సే రాబట్టుకుంటుంది. నాలుగు రోజుల్లోనే ఈసినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈసినిమా ఇప్పుడు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేసింది. కాగా ఈసినిమాలో కత్రినా కైఫ్ నటించగా అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించాడు.ఏవియేషన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమాకు విశాల్-శేఖర్ సంగీతం అందించగా వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా హృతిష్ రోషన్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలో ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాపై హైప్ బాగా పెరిగింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ఎన్టీఆర్ కూడా ఈ షూట్ లో త్వరలోనే పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ భారీ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: