స్టార్ డైరెక్టర్ శంకర్ -గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.దాదాపు రెండు సంవత్సరాల అవుతుంది సినిమా సెట్స్ మీదకు వెళ్లి అయితే షూటింగ్ ఇంకా పూర్తికాలేదు.శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.ఇక ఈరోజు ఈసినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఫైట్ మాస్టర్లు అన్బఅరివ్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరక్కిస్తున్నారు.ఇందుకోసం చాలా రోజులు డేట్స్ కేటాయించారు.ఈషెడ్యూల్ తో మేజర్ షూటింగ్ అంతా పూర్తయినట్లే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, శ్యామ్,అంజలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.ఇక రిలీజ్ డేట్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు మేకర్స్. కుదిరితే సెప్టెంబర్ లో లేదా డిసెంబర్ లో సినిమాను విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈసినిమాను ఫూర్తి చేసి ఏప్రిల్ నుండి తన 16వ సినిమాను మొదలుపెట్టే యోచన లో వున్నాడు రామ్ చరణ్.రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈసినిమాను బుచ్చి బాబు సన డైరెక్ట్ చేయనున్నాడు.ప్రస్తుతం క్యాస్టింగ్ ను ఎంపిక చేసే పనిలో వున్నారు.అందులో భాగంగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ తీసుకోవాలనుకుంటున్నారట.త్వరలోనే ఈవిషయంలో క్లారిటీ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























