టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించగా.. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా.. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. అవుట్ అండ్ అవుట్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ‘కిష్టయ్య’గా ఫుల్ మాస్ రోల్‌లో నాగార్జున డైలాగ్స్, హీరోయిజం అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ.. విడుదలైన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించింది.
కాగా మలయాళంలో వచ్చిన ‘పురింజు మరియం జోస్’ అనే మూవీకి రీమేక్‌గా ఇది తెరకెక్కిడం విశేషం. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో త్వరలో ప్రసారం కానుంది. ఫిబ్రవరి 17 నుండి నా సామిరంగ స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసింది. సో.. అక్కినేని ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ గెట్ రెడీ.. ఫిబ్రవరి 17న ఎంచక్కా ఇంట్లోనే ఈ పొంగల్ బ్లాక్ బస్టర్‌ను వీక్షించండి.
Just one more week until we get to see the King 👑 #NaaSaamiRangaonHotstar Streaming from 17th Feb only on #DisneyPlusHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @actorshabeer @srinivasaaoffl… pic.twitter.com/b32dwWbrIH
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 10, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: