హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్

Suhas Thanks Note To Audience

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరో అయినా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఆరేర్ ఫీట్ ను అతి తక్కువ మంది మాత్రమే అందుకోగలుగుతున్నారు. అందులోనూ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న హీరోలకు అయితే అది ఇంకా కష్టమని చెప్పొచ్చు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను కూడా చాలా తొందరగానే రీచ్ అయ్యాడు యంగ్ హీరో సుహాస్.యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పపనక్కర్లేదు. షార్ట్ ఫిలింస్ దగ్గర నుండి క్యారెక్టర్ రోల్స్ చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సినిమా హీరో స్థాయికి ఎదిగాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హీరోగా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కథా ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటున్నాడు. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంజాబీపేట మ్యారేజి బ్యాండు ఇలా వరుసగా మూడు హిట్లుకొట్టి హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా సుహాస్ తన ట్విట్టర్ ద్వారా తనకు హ్యాట్రిక్ అందించినందుకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశాడు.

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాను మేము అనుకున్నట్టుగానే.. ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టడం దగ్గరనుండి ఇప్పుడు బుక్ మై షో లో టికెట్స్ కొనేవరకూ నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీ ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనిది. నటుడిగా నా పరిథిలో నేను చేయగలిగినంత వరకూ నా స్థాయిలో కథలను ఎంచుకొని మీ ముందుకు తీసుకురావడమే నా ఈ చిన్న ప్రయత్నం. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలే వాటికి ఉదాహరణ. వచ్చే నెలలో నేను కథానాయకుడిగా మీ ముందుకు రాబోతున్న ప్రసన్న వదనం.. దిల్ రాజు గారు నిర్మాతగా రాబోతున్న మరో సినిమా.. అలానే కేబుల్ రెడ్డి సినిమా ఇంకా మీరు థియేటర్ కు వచ్చి హాయిగా నవ్వుకొని ఆస్వాదించే ఇంకొక మూడు మంచి సినిమాలతో మీ ముందుకి రాబోతున్నాను. హ్యాట్రిక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మరొక హ్యాట్రిక్ ఇస్తారని నా ప్రయత్నం నేను చేస్తూనే మీ ఆదరణ కోసం ఎదురుచుస్తూ ఉంటాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =