సీతారామం రీ రిలీజ్ డేట్ ఫిక్స్

sita ramam movie re release date fixed

హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా సీతారామం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో హను రాఘవపూడి కథ ముఖ్యంగా హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయి పోయారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈమధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా రీరిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ క్లాసిక్ లవ్ స్టోరీని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు.

కాగా ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఈసినిమాను వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మించారు. ఈసినిమాలో ఇంకా ప్రకాష్ రాజ్, సుమంత్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, సునీల్, ప్రియదర్శి పలువురు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =