రెండు రోజుల ముందే భైరవకోన ప్రీమియర్స్ 

OoruPeru BhairavaKona Premieres on FEB 14th

వచ్చే వారం ఊరు పేరు భైరవకోన థియేటర్లోకి రానుంది.ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బాస్టర్ కావడం అలాగే ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మంచి బజ్ ఏర్పడింది.దాంతో  తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది.టీం కూడా సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.ఇక కంటెంట్ మీద వున్న నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఈషోల లో హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి ఐ ఆనంద్ డైరెక్ట్  చేసిన ఈసినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించగా హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించాడు.గత ఏడాది ఈ బ్యానర్ నుండి వచ్చిన సామజవరగమన బ్లాక్ బాస్టర్ అయ్యింది.

ఇక వి ఐ ఆనంద్ -సందీప్ కిషన్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా.గతంలో వీరి కాంబోలో వచ్చిన టైగర్  డీసెంట్ హిట్ అనిపించుకుంది.మరి ఇప్పుడు భైరవకోన తో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంటారో చూడాలి.సందీప్ కిషన్ కు కూడా ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది.ఈనెల 16న ఈసినిమా థియేటర్లోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =