ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కెప్టెన్ మిల్లర్.. ఎక్కడంటే?

Dhanush's Captain Miller Streaming in OTT Now

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రలో వచ్చిన రీసెంట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. పీరియాడికల్ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రల్లో కనిపించారు. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. గత నెలలో పొంగల్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ తమిళనాట మంచి సక్సెస్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తెలుగులో రిలీజ్ లేట్ కావడం కారణంగా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్దరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. బ్రిటిష్ రూలింగ్ సమయంలోని కథాంశం, అలాగే ఆనాటి సామాజిక అసమానతలు నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందనడంలో సందేహం లేదు. సో మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకోకండి.

కాగా ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండటం విశేషం. ఏషియన్ సునీల్, పుస్కూరు రామ్ మోహన్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 1 =