రవితేజ ఈగల్ రివ్యూ

eagle telugu movie review

నటీనటులు : రవితేజ,అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల
దర్శకత్వం :కార్తీక్ ఘట్టమనేని
సంగీతం : దేవ్ జాన్డ్
సినిమాటోగ్రఫి :కర్మ్ చావ్లా
నిర్మాతలు : టిజి విశ్వప్రసాద్,వివేక్ కూచిబొట్ల

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి రావాల్సిన ఈగల్ మిగితా సినిమాలకోసం వెనక్కి తగ్గి ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది దానికి తోడు టీం గట్టిగానే ప్రమోట్ చేశారు.ఫైనల్ కాపీ చూసి రవితేజ ఏక్సయిట్ అవ్వడం ఇవన్నీ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చాయి. మరి మంచి అంచనాల మధ్య  వచ్చిన ఈగల్ ఎలా వుంది? అంచనాలను అందుకుందా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నన రవితేజకు విజయాన్ని అందించిందా అన్నది రివ్యూలో చూడాల్సిందే.

కథ : 

తలకోన అటవీ ప్రాంతంలో ఓ గిరిజన తండాలో సహదేవ్ వర్మ (రవితేజ ) విగ్రహాన్నిపెట్టుకొని  దేవుడిలా కొలుస్తూ ఉంటారు.ఇక విలేకరి అయిన నళిని రావు (అనుపమ) ఓ స్పెషల్ కాటన్ క్లాత్ చూసి ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఓ ఆర్టికల్ రాయడంతో అది కాస్త సీబీఐ కంట పడుతుంది అసలు ఆ కాటన్ క్లాత్ కి సహదేవ్ కి సంబంధం ఏంటి? ఎందుకు ఆర్టికల్ చూసి సీబీఐరియాక్ట్ అవుతుంది? ఎందుకు సహదేవ్ ను దేవుడిలా పూజిస్తారు.సహదేవ్ భార్య రచన (కావ్య థాపర్)కు  ఏమైతుంది? అసలు ఈ కథలో ఈగల్ ఎవరు ?అనేది తెల్సుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఎవరు టచ్ చేయని పాయింట్ తో కథను రాసుకొని దాన్ని ఎంగేజింగ్ గా తెర మీద తీసుకరావడం లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సక్సెస్ అయ్యాడు.చాలా గ్యాప్ తరువాత మళ్లీ ఈసినిమాతో వచ్చినా బాగా డీల్ చేశాడు.మధ్యలో నరేషన్ కొంచెం కన్ఫ్యూజ్ చేసినా అదేమీ పెద్ద కంప్లైన్ట్ అనిపించదు.

ఫస్ట్ హాఫ్ లో రెండు యాక్షన్ సీక్వెన్క్ ఆకట్టుకుంటాయి మిగితా అంత అలా సాగిపోతుంది ఇక ఇంటర్వెల్ బ్లాక్ నుండి సినిమాఫై ఆసక్తి పెరుగుతుంది.సెకండ్ హాఫ్ అయితే సూపర్ అనిపించుకుంది.ముఖ్యంగా చివరి 40నిమిషాలు సినిమాను నిలబెట్టింది.స్టయిలిష్ యాక్షన్ సీక్వెన్క్ థ్రిల్ చేస్తాయి.చివర్లో ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుందని చెప్పేశారు.ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించగా సెకండ్ హాఫ్ అదుర్స్ అనిపించుకుంది.

నటీనటుల విషయానికి వస్తే సహదేవ్ వర్మ గా రవితేజ విశ్వరూపం చూపించాడు.సినిమాలో దాదాపు అంతా సీరియస్ రోల్ లో కనిపించాడు.లుక్స్ డిఫరెంట్ గా వుంది.యాక్షన్ సన్నివేశాల్లో తన అనుభవం చూపించాడు.సవాలు తో కూడిన పాత్రయితే కాదు కానీ డిఫరెంట్ రోల్ లో కనిపించాడు.ఇద్దరు హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్ ,కావ్య థాపర్ యాక్టింగ్ పరంగా గ్లామర్ గా కనిపించి మెప్పించారు.మిగితా కీలక పాత్రల్లో నటించిన నవదీప్ ,మధుబాల,శ్రీనివాస్ అవసరాల తమ పాత్రలకు న్యాయం చేశారు.ముఖ్యంగా నవదీప్ కు మంచి పాత్ర దొరికింది.

టెక్నికల్ గా సినిమా బ్రిలియంట్ అనిపించింది.సినిమాటోగ్రఫీ హాలీవుడ్ లెవెల్లో వుంది.విజువల్స్  ఆకట్టుకున్నాయి.కార్తీక్ స్వయంగా సినిమాటోగ్రాఫర్ కావడంతో తన కథకు తగ్గట్టుగా విజువల్స్ ను రాబట్టుకున్నాడు.ఇంకా పాటల సంగతి పక్కనపెడితే దేవ్ జాన్డ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ గా ఉంది.యాక్షన్ సీక్వెన్స్ లు అయితే సినిమాకే హైలెట్ గా నిలిచాయి.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి ఏమాత్రం రాజీపడకుండా నిర్మించారు.మేకింగ్ లో ఆ రిచ్ నెస్ కనిపిస్తుంది.

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన ఈగల్ అంచనాలను అందుకుంది అని చెప్పొచ్చు.ఫస్ట్  హాఫ్ డీసెంట్  అనిపించుకోగా సెకండ్ హాఫ్ సూపర్ అనేలా వుంది.రవితేజ ఫ్యాన్స్ కు అలాగే యాక్షన్ లవర్స్ కు ఈసినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.మిగితా వారు కూడా ఒకసారి చూసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 6 =