రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగ సందర్భంగానే ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు రాజాసాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ పై ఈసినిమా నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్ ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. తాజాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వప్రసాద్ ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. డేట్ ను ఒకసారి ఫిక్స్ చేసిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని తెలియచేశాాడు. ఇక ప్రభాస్ సినిమా ఇంత తొందరగా వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్గా.. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేయనున్నారు. ఇక ఈసినిమాలో నటించే హీరో హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: