తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించడానికి నిర్ణయించుకుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవిని సత్కరించాలని భావించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా రేపు (ఫిబ్రవరి 04, 2024) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆయనను ఘనంగా సత్కరించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అలాగే చిరుతోపాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన మరికొందరిని కూడా సత్కరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన పద్మ అవార్డుల గ్రహీతలను సన్మానించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























