టాలీవుడ్ లో ఉన్న సెన్సిటివ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రస్తుతం తను ధనుష్-నాగార్జున హీరోలుగా వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించినా ధనుష్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం చాలా టైమ్ పట్టింది. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈసినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ లోనే శేఖర్ కమ్ముల మరో సినిమాను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. వీరి కాంబినేేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో లవ్ స్టోరీ సినిమా వచ్చింది.. ఇప్పుడు ధనుష్-నాగార్జున సినిమా వస్తుండగా.. తాజాగా మూడో సినిమాను ప్రకటించారు. ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారట. ఇక ఈసినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియచేయనున్నట్టు తెలిపారు.
Sree Venkateswara Cinemas proudly Announcing its third Masterstroke with acclaimed director @sekharkammula garu!
Stay tuned for this magnum opus after the success of Love Story and the ongoing #DNS
MORE DETAILS SOON 🔜@amigoscreation @AsianSuniel @puskurrammohan #JhanviNarang pic.twitter.com/w22UFai68S
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 31, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: