హనుమాన్ 20వ రోజు కూడా జోరు కొనసాగించింది.తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది దాంతో వరుసగా 20వరోజు కూడా కోటి రూపాయలు రాబట్టి బాహుబలి సరసన నిలిచింది.ఈజాబితాలో బాహుబలి 2 మొదటి స్థానం లో వుంది అయితే ఈ స్థానాన్ని అందుకోవడం హనుమాన్ కు అసాధ్యమనే చెప్పాలి.ఇక హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా 20రోజుల్లో 270కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టుకుంది.ఈవారం అన్ని చిన్న సినిమాలే వుండడంతో హనుమాన్ ఈవీకెండ్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అటు హిందీలో ఈసినిమా 45కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే 50కోట్ల మార్క్ చేరుకోవడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.ఓవర్సీస్ విషయానికి వస్తే 5.5మిలియన్ వసూళ్లను రాబట్టుకొని మీడియం రేంజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.
హనుమాన్ ను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా తేజ సజ్జా హీరోగా నటించాడు.ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.జై హనుమాన్ అనే టైటిల్ తో తెరకెక్కనుంది.ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి.త్వరలోనే ఈసినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: