టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. ఈ మేరకు ఆయన బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. తన మేనల్లుడు, యంగ్ హీరో అశిష్ రెడ్డి వివాహం త్వరలో జరుగనున్న నేపథ్యంలో.. దిల్ రాజు జూ. ఎన్టీఆర్‌ను ఈ శుభకార్యానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెడ్డింగ్ కార్డ్ అందించి తమ ఇంట జరుగుతున్న ఈ ఈవెంట్‌కు రావాల్సిందిగా కోరారు. ఇక ఈ సందర్భంగా తారక్‌తో దిల్ రాజు, శిరీష్, అశిష్, హన్షిత రెడ్డి తదితరులు ఫోటోలు దిగగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైతా రెడ్డితో ఆశిష్ రెడ్డి వివాహం ఫిబ్రవరి 14న జరుగనుంది. జైపూర్‌లో గ్రాండ్ గా నిర్వహించనున్న ఈవెంట్‌లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గతేడాది నవంబర్ 30న వీరి నిశ్చితార్థం జరిగింది. 2022లో వచ్చిన ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఆశిష్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. దీని తర్వాత విశాల్ కాశీ దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ అనే సినిమా చేశాడు. ఇందులో ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో ఆయన హీరోగా మూడో చిత్రం ఇటీవలే ప్రారంభమవ్వగా.. ఇందులో ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా చేస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: