విశ్వంభర కోసం.. జిమ్‌లో కసరత్తులు మొదలెట్టిన మెగాస్టార్, వీడియో వైరల్

Megastar Chiranjeevi Gearing up and Raring to go Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే భారత రెండో అత్యున్నత పురాస్కారమైన ‘పద్మవిభూషణ్’ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా త్వరలోనే ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. ఇక ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి తాజాగా కథానాయకుడిగా ‘విశ్వంభర’ చిత్రం చేస్తోన్న విషయం విదితమే. ఈ సినిమాకు ‘బింబిసార’తో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ముల్లోకాలు, పంచభూతాల నేపథ్యంలో సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో తెరకెక్కుతుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన ‘విశ్వంభర’ టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మెగాస్టార్ కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే అంతకంటే ముందుగా ఆయన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా చిరంజీవి జిమ్‌లో కసరత్తులు మొదలెట్టారు. గంటల తరబడి కఠినమైన వర్కవుట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ‘విశ్వంభర’  మాస్టర్ పీస్‌గా రూపొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం గమనార్హం. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, కీరవాణి కాంబోలో అనేక మ్యూజికల్ హిట్ మూవీస్ ఉన్న నేపథ్యంలో.. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనుండటంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు మరియు టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =