సందీప్ రెడ్డి వంగ -రణ్బీర్ కపూర్ కాంబో లో వచ్చిన యానిమల్ గత ఏడాది చివర్లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది.అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఏకంగా 700కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకొని అదరగొట్టింది.ఇక ఈసినిమా రీసెంట్ గా ఓటిటి లోకి కూడా వచ్చింది.తెలుగుతోపాటు అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ గత వారం స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక యానిమల్ ఓటిటి లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రీయేట్ చేస్తుంది.ఈసినిమా గ్లోబల్ వైడ్ గా నాలుగో స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.వ్యూస్ పరంగా చూస్తే మూడు రోజుల్లో అన్ని భాషల్లో కలిపి ఈసినిమాకు 6.2 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోగా 20.08 మిలియన్ గంటలు వీక్షించారు.అలా మొత్తానికి థియేటర్లలో రచ్చ చేసిన ఈసినిమా ఓటిటిలోకూడా హావ కొనసాగిస్తోంది.
తండ్రి- కొడుకుల మధ్య జరిగే కథ తో బోల్డ్ గా వచ్చిన ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అనిల్ కపూర్,బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.హర్ష వర్ధన్ రామేశ్వరన్ సంగీతం అందించగా టి సిరీస్,భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి.ఇక ఈసినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ కూడా రానుంది.వచ్చే ఏడాది ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: