టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జా ప్రధానపాత్రలో నటించగా.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి విజయం సాధించింది. పండుగ బరిలో పలు స్టార్ హీరోల చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై అనూహ్యంగా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హనుమాన్ టీమ్‌ని అభినందించారు. సోమవారం రాత్రి హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్‌లో హనుమాన్ చిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించిన ఆయన.. అనంతరం మూవీ టీమ్‌ని ప్రశంశలతో ముంచెత్తారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రం లోని ప్రతిఘట్టం తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. అలాగే సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయన్న వెంకయ్యనాయుడు, ఇందులో నటించిన నటీనటుల నటన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.
హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం హనుమాన్ చలనచిత్రాన్ని స్నేహితులతో కలిసి వీక్షించాను. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన శ్రీ ఆంజనేయస్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రం లోని ప్రతిఘట్టం ఆకట్టుకుంది.… pic.twitter.com/Sld4lKnUT1
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) January 29, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: