చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తండేల్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమమ్ అలానే సవ్యసాచి సినిమాలు రాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు. ఈసినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే స్టార్ట్ చేసిన సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్ డేట్లు కూడా ఇచ్చారు మేకర్స్. నాగచైతన్య, సాయి పల్లవిల ఫస్ట్ లుక్ లు అలానే ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ అయితే సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ పై ఇప్పుడు క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో భారీ ఛేజింగ్ సీక్వెన్స్ జరుగుతున్నాయట. ఈ సీక్వెన్స్ నాగ చైతన్య ఇంకా మెయిన్ విలన్ మధ్య జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక సాయి పల్లవి ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంది. అయితే ప్రస్తుతం తన చెల్లి పెళ్లితో బిజీగా ఉండటం వల్ల కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది.
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: